News March 22, 2025
సంగారెడ్డి: తాగునీటి సరఫరాపై కలెక్టర్ క్షేత్రస్థాయి సమీక్ష

రాబోయే వేసవి దృష్ట్యా సంగారెడ్డి మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా పరిస్థితిని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్లు, పంప్ హౌస్ నిర్వహణను పరిశీలించారు. సంబంధిత అధికారులతో పాలు అంశాలు అడిగి తెలుసుకున్నారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని సూచించారు.
Similar News
News November 16, 2025
భర్త హత్యాయత్నం ఘటనలో భార్య మృతి

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో అనుమానంతో ఎర్రిస్వామి తన భార్య రత్నమ్మను కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఈనెల 12న చోటుచేసుకుంది. రత్నమ్మను కుటుంబసభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
News November 16, 2025
HYD: బంధాన్ని నిలుపుకో.. వదులుకోకు..!

HYDలో మనువు మున్నాళ్ల ముచ్చటగా మారుతున్న పరిస్థితి కలవరపెడుతోంది. ఈగో, విలువలు తగ్గటం, వివాహేతర సంబంధాలు, అభద్రతా భావం, తొందరపాటు నిర్ణయాలు, కొత్తకల్చర్ వంటి వాటితో కోర్టు మెట్లెక్కుతున్నట్లు ఏటా నమోదవుతున్న కేసులు చెబుతున్నాయి. ఇందులో 25- 35 ఏళ్ల జంటలు 75% ఉన్నాయి. న్యాయస్థానాల్లో ప్రతినెలా 250 కేసులు నమోదవుతున్నాయి. బంధాన్ని బలపర్చుకోవడానికి ఆలోచించాలి కానీ బలహీనపరుచుకోవడానికి కాదని పెద్దల మాట.
News November 16, 2025
తేనెటీగల పెంపకంలో మహిళల విజయం: సీఎండీ

సింగరేణి సామాజిక బాధ్యతలో భాగంగా కొత్తగూడెం ఏరియాలో మహిళల స్వయం ఉపాధి కోసం చేపట్టిన తేనెటీగల పెంపకం కార్యక్రమం విజయవంతమైంది. ఉత్పత్తి అయిన తొలి తేనెను మహిళలు ఆదివారం సీఎండీ ఎన్. బలరామ్కు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తమకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబనను అందిస్తోందని సీఎండీ పేర్కొన్నారు.


