News July 30, 2024
సంగారెడ్డి: దిగివచ్చిన టమాట ధర.. సామాన్యులకు ఊరట
సంగారెడ్డి: టమాట ధర ఎట్టకేలకు దిగి రావడంతో సామాన్యులకు కాస్త ఊరట లభించింది. సంగారెడ్డి, మెదక్, నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట, తదితర మార్కెట్లో కిలో టమాటా ధర రూ. 50 నుంచి రూ. 40 పలుకుతుంది. కిలో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, బెండకాయ, ఆకు కూరగాయల ధరలు అలాగే ఉన్నాయి. ధరల పెరుగుదలను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Similar News
News October 8, 2024
రేవంత్ రెడ్డికి అమ్మవారు సద్బుద్ధిని ప్రసాదించాలి: హరీశ్ రావు
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి, BRS నేత హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. హైడ్రా పేరుతో పేద ప్రజలు ఆవేదనకు గురిచేస్తోందని మండిపడ్డారు. అవకాశాలు వస్తే పేదలకు మంచి చేయాలని అంతే గానీ వారికి కన్నీరు పెట్టించడం సరికాదన్నారు. మల్కాజిగిరి పరిధిలో నిర్వహించిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అమ్మవారు సద్బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు హరీశ్ చెప్పారు.
News October 7, 2024
మెదక్: ‘ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి’
ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలువురు దరఖాస్తు దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈకార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, దరఖాస్తు దారులు, తదితరులు పాల్గొన్నారు.
News October 7, 2024
మెదక్: ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు గడువు పెంపు
మెదక్ జిల్లాలోని ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్‌లో ప్రవేశం పొందేందుకు ఈనెల 31 వరకు గడువు పొడగించినట్లు జిల్లా విద్యాధికారి రాధాకిషన్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యలో చదువు ఆపేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాల కోసం స్థానికంగా ఉండే ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌లో సంప్రదించాలన్నారు.