News March 21, 2024
సంగారెడ్డి: ‘ధరణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి’

ధరణి పెండింగ్ దరఖాస్తులను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం ప్రకటనలో తెలిపారు. తహసిల్దార్ క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలించిన తర్వాత వెంటనే ఆర్డీవో, కలెక్టరేట్ పంపించాలని చెప్పారు. దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని దరఖాస్తులను పరిశీలించాలని సూచించారు.
Similar News
News February 24, 2026
మెదక్: ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

మెదక్ జిల్లాలోని 28 కేంద్రాల్లో ఇంటర్ వార్షిక పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు ఉ. 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుందని, 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
News February 24, 2026
మెదక్: ‘పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి’

ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై సీఎస్ రామకృష్ణారావు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్, మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని సీఎస్ తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా విద్యా, పోలీస్, ఆర్టీసీ, వైద్య శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
News February 24, 2026
మెదక్: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

పదో తరగతి, ఇంటర్ ఓపెన్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు జరుగుతాయని డీఈఓ విజయ తెలిపారు. మే 5 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి రెండు విడతల్లో ఉంటాయి. ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ వీటికి అర్హులని వెల్లడించారు. సందేహాల కోసం ఎస్. వెంకటస్వామిని సంప్రదించాలని సూచించారు.


