News February 5, 2025
సంగారెడ్డి: నవ వధువు సూసైడ్

అదనపు కట్నం వేధింపులతో నవ వధువు <<15357920>>సూసైడ్<<>> చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ సాకేత్ నగర్కు చెందిన సాయికి సంగారెడ్డి జిల్లా మునిపల్లికి చెందన శ్రీజతో గతేడాది నవంబర్లో పెళ్లైంది. ఇంతలో అదనపు కట్నం కోసం భర్త వేధించ సాగాడు. ఇప్పుడు డబ్బులు ఇచ్చే స్థితిలో మా వాళ్లు లేరని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా భర్త వినలేదు. దీంతో విషయం కుటుంబీకులు నిన్న ఫోన్లో చెప్పిన శ్రీజ అనంతరం ఇంట్లో ఉరేసుకుంది.
Similar News
News October 21, 2025
నేవీ చిల్డ్రన్ స్కూల్లో ఉద్యోగాలు

నేవీ చిల్డ్రన్ స్కూల్ 8 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, డిగ్రీ, బీఈడీ, డిప్లొమాతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. వయసు 21 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డెమాన్స్ట్రేషన్ క్లాస్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. వెబ్సైట్: https://ncsdelhi.nesnavy.in/
News October 21, 2025
ఈనెల 22న అన్నపూర్ణేశ్వరి మాత పూజ.. స్వాములకు బిక్ష ప్రారంభం..!

కార్తీక పాడ్యమి సందర్భంగా ఈనెల 22న జిల్లా కేంద్రంలోని శ్రీ వీరశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉదయం 11 గంటలకు అన్నపూర్ణేశ్వరి మాత పూజ నిర్వహించి, స్వాములకు (అన్న ప్రసాదం) బిక్షను ప్రారంభించనున్నట్లు అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ, అన్న ప్రసాద సేవా సమితి పేర్కొన్నాయి. పూజ అనంతరం మంటపంలో మాలాధారులకు అన్నప్రసాద వితరణ చేస్తామని, గురుస్వాములు, అన్న ప్రసాదదాతలు, శాశ్వత సభ్యులు, స్వాములు పాల్గొన్నాలని కోరారు.
News October 21, 2025
HYD: ఎన్నికల పరిశీలకులను నియమించిన ఎలక్షన్ కమిషన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ముగియనుండగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికను పరిశీలించేందుకు ముగ్గురు అధికారులను పరిశీలకులుగా నియమించింది. సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్ సింగ్, పోలీస్ పరిశీలకులుగా ఓం ప్రకాశ్ త్రిపాఠి(IPS), ఇక వ్యయ పరిశీలకులుగా IRS అధికారి సంజీవ్ కుమార్ లాల్ నియమితులయ్యారు.