News February 5, 2025
సంగారెడ్డి: నవ వధువు సూసైడ్

అదనపు కట్నం వేధింపులతో నవ వధువు <<15357920>>సూసైడ్<<>> చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ సాకేత్ నగర్‌కు చెందిన సాయికి సంగారెడ్డి జిల్లా మునిపల్లికి చెందన శ్రీజతో గతేడాది నవంబర్‌లో పెళ్లైంది. ఇంతలో అదనపు కట్నం కోసం భర్త వేధించ సాగాడు. ఇప్పుడు డబ్బులు ఇచ్చే స్థితిలో మా వాళ్లు లేరని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా భర్త వినలేదు. దీంతో విషయం కుటుంబీకులు నిన్న ఫోన్‌లో చెప్పిన శ్రీజ అనంతరం ఇంట్లో ఉరేసుకుంది.
Similar News
News February 12, 2025
కాగజ్‌నగర్: అనుమానంతో యువకుడిపై దాడి

పట్టణంలోని ద్వారకా నగర్‌కు చెందిన అక్రమ్ ఖాన్ పై మంగళవారం రాత్రి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాదారులు దాడికి పాల్పడ్డారు. చిన్న మసీద్ సమీపంలో ఉన్న అతడిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి చితకబాదారు. మంగళవారం పోలీసులు 208 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆ బియ్యాన్ని అక్రమ్ ఖాన్ పట్టించాడనే అనుమానంతో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.
News February 12, 2025
కోయిలకొండ: కరెంట్ షాక్ తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

కరెంట్ పని చేస్తుండగా.. ఓ వ్యక్తికి షాక్ తగిలిన ఘటన బిజినేపల్లిలో చోటచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. కోయిలకొండ మండలం లింగుపల్లి గ్రామానికి చెందిన బాబు(38) బిజినేపల్లిలో కరెంటు పని చేస్తుండగా ఒక్కసారిగా షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు ఓ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అక్కడి నుంచి HYDకి పంపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 12, 2025
‘లైలా’ రన్ టైమ్ ఎంతంటే?

‘లైలా’ మూవీకి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా రన్ టైమ్ ఎండింగ్ కార్డ్స్‌తో కలుపుకొని 2 గంటల 16 నిమిషాలు ఉన్నట్లు మూవీ వర్గాలు పేర్కొన్నాయి. విశ్వక్ సేన్, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎల్లుండి థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల కమెడియన్ <<15413032>>పృథ్వీ చేసిన వ్యాఖ్యలతో<<>> ఈ మూవీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.