News March 19, 2025
సంగారెడ్డి: నిమ్జ్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిమ్జ్ ఏర్పాటు కోసం అవసరమైన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిమ్జ్ ఏర్పాటుతో మారుమూల ప్రాంతాలైన జహీరాబాద్ నియోజకవర్గాల రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. సమావేశంలో ప్రత్యేక అధికారి రాజు, జహీరాబాద్ ఆర్డీవో రామిరెడ్డి పాల్గొన్నారు.
Similar News
News December 5, 2025
VJA: భవానీలకు 15 లక్షల వాటర్ బాటిల్స్.. 100 ప్రత్యేక బస్సులు.!

ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 11 నుంచి 15 వరకు జరిగే భవానీ మాల విరమణకు సుమారు 7 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం 15 లక్షల వాటర్ బాటిళ్లు, 325 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ బస్టాండ్ నుంచి RTC 100 అదనపు బస్సులను కేటాయించింది. ప్రస్తుతం ఆలయం వద్ద బారిగేట్ల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి.
News December 5, 2025
బెంజ్, రేంజ్ రోవర్ కాకుండా ఫార్చునర్.. అందుకేనా?

నిన్న మోదీ, పుతిన్ టయోటా ఫార్చునర్ కారులో ప్రయాణించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. రేంజ్ రోవర్, బెంజ్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ వారు ఫార్చునర్‌లోనే ప్రయాణించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా 2022లో అమెరికాతో పాటు యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశాల కార్లు కాకుండా జపాన్‌కు చెందిన టయోటాను ఎంచుకుని మోదీ, పుతిన్ వారికి బలమైన సందేశం పంపినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.
News December 5, 2025
పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్, ఎస్పీ

రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత పోలేరమ్మ అమ్మవారిని కలెక్టర్ కృతికా శుక్ల, ఎస్పీ కృష్ణారావు దర్శించుకున్నారు. తిరునాళ్ల సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్నాటి కోనసీమగా పిలువబడే మంచికల్లులో ఎన్నో సంవత్సరాలుగా ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో గురజాల, మాచర్ల ఎమ్మెల్యేలు, డీఎస్పీ, తదితరులు పాల్గొన్నారు.


