News July 11, 2024
సంగారెడ్డి: నిర్మలాజగ్గారెడ్డికి మంత్రుల అభినందన

సంగారెడ్డి DCC అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఈరోజు TGIIC కార్పొరేషన్ ఛైర్మన్‌గా పదవి బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తంకుమార్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తనకు కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేతలకు నిర్మలా జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 16, 2025
మెదక్: గంజాయి మత్తు పదార్థాల బారీన పడకుండా చర్యలు: కలెక్టర్

రేపటి సమాజ నిర్మాతలైన యువత డ్రగ్ మహమ్మారి బారీన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన నార్కోటిక్ కో-ఆర్డినేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ జిల్లా ఎస్పీ పాల్గొని పలు అంశాలపై సూచనలు చేశారు. యువతకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు.
News February 16, 2025
మెదక్: ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

కౌడిపల్లి మండల కేంద్రంలోని PHCని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, రోగుల గదులు, మందుల నిల్వ ఉండే గదులను పరిశీలించారు. రోగులతో సేవల గురించి ఆరా తీశారు. సేవలు బాగున్నాయా, ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. డాక్టర్లు, సిబ్బంది బాగా పనిచేస్తున్నారని గతంలో ఒకసారి తనిఖీ చేసినపుడు సేవలు సరిగా ఉండేవి కావని గుర్తు చేశారు.
News February 16, 2025
మెదక్: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: కలెక్టర్

ట్రాఫిక్ నియమాలు పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. మెదక్ కలెక్టరేట్లో రోడ్డు ప్రమాదాల నివారణపై నేషనల్ హైవే, ఆర్అండ్బీ అధికారులతో శనివారం జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.