News March 13, 2025

సంగారెడ్డి: నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. సంగారెడ్డిలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆస్తి పన్ను వసూలు చేయాలని చెప్పారు. ఎల్ఆర్ఎస్‌పై కూడా ప్రజలకు అవగాహన కల్పించి రెగ్యులర్ చేసుకునేలా చూడాలని పేర్కొన్నారు.

Similar News

News December 6, 2025

మూడో విడతలో 27,277 నామినేషన్లు

image

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతలో 4,158 సర్పంచ్ స్థానాలకు 27,277 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. 36,442 వార్డు స్థానాలకు 89,603 మంది నామినేషన్లు వేశారని పేర్కొన్నారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 1,192 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. ఉపసంహరణకు గడువు ఈ నెల 9 వరకు ఉంది. మూడో విడత ఎన్నికలు 17న జరగనున్నాయి.

News December 6, 2025

జగిత్యాల: తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుశిక్ష తప్పదు

image

వృద్ధ తల్లిదండ్రులను పోషించడం పిల్లల చట్టబద్ధ బాధ్యత అని, నిర్లక్ష్యం చేస్తే జైలు, జరిమానా తప్పవని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ హెచ్చరించారు. ఆర్డీవో ఛాంబర్‌లో గుల్లపేట, మల్లన్నపేట్, అల్లీపూర్, పూడూర్ గ్రామాల వృద్ధుల నిరాధారణ కేసులను విచారించారు. వయోవృద్ధుల తరఫున సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ వాధించారు. ఈ కార్యక్రమంలో అధికారులు రవికాంత్, హన్మంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News December 6, 2025

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌లో పోస్టులు

image

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<>HAL<<>>), బెంగళూరు డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు www.mhrdnats.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 8 నుంచి 13 వరకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎంపికైన అప్రెంటిస్‌లకు నెలకు రూ.10,900 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in/