News March 13, 2025

సంగారెడ్డి: నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. సంగారెడ్డిలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆస్తి పన్ను వసూలు చేయాలని చెప్పారు. ఎల్ఆర్ఎస్‌పై కూడా ప్రజలకు అవగాహన కల్పించి రెగ్యులర్ చేసుకునేలా చూడాలని పేర్కొన్నారు.

Similar News

News February 11, 2026

ఆసిఫాబాద్‌లో 67.13% పోలింగ్

image

ఆసిఫాబాద్ జిల్లాలోని 2 మున్సిపాలిటీల్లో పోలింగ్ బుధవారం సాయంత్రం ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 67.13% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్‌లో 20 వార్డుల్లో 77.67%, కాగజ్ నగర్‌లో 64.32% పోలింగ్ జరిగింది.

News February 11, 2026

హనుమకొండ జిల్లాలో 1170 కొత్త టీబీ కేసులు గుర్తింపు

image

టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లాలో ఇంటింటా సర్వేలో 1,82,359 మందికి పరీక్షలు నిర్వహించగా 1170 కొత్తగా టీబీ కేసులు గుర్తించి నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అప్పయ్య తెలిపారు. కొత్తగా గుర్తించిన టీబి వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 511 మంది వ్యాధిగ్రస్థులకు న్యూట్రిషన్ కిట్లు అందించినట్లు తెలిపారు.

News February 11, 2026

నిర్మల్: ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం

image

నిర్మల్ జిల్లాలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు అన్నిచోట్ల ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరగక ఇటు ఎన్నికల అధికారులు.. అటు పోలీస్ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఇద్దరు అధికారులు పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. మరో పక్క జిల్లా పోలీస్ యంత్రాంగం ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.