News March 10, 2025
సంగారెడ్డి: నేటి నుంచి ఇంటర్మీడియట్ వాల్యుయేషన్

సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఈనెల 10 నుంచి ఇంటర్మీడియట్ వాల్యూయేషన్ చేయనున్నట్లు జిల్లా అధికారి గోవిందారం తెలిపారు. 10న సంస్కృతం, 22న ఫిజిక్స్, 24న ఎకనామిక్స్, 26న కెమిస్ట్రీ, కామర్స్, 28న చరిత్ర, బాటని, జువాలజీ సబ్జెక్టుల వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.
Similar News
News October 17, 2025
మెదక్: ‘తపాలా శాఖ ద్వారా ఓటర్లకు గుర్తింపు కార్డులు’

నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా మెదక్ జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ రాహుల్ రాజ్, సహాయ ఎన్నికల అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు. ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరికి తపాలా శాఖ ద్వారా ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలని తెలిపారు.
News October 17, 2025
కామారెడ్డి: ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా OCT21న విద్యార్థులు, ఔత్సాహిలకు, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం పలుకుతున్నట్లు కామారెడ్డి జిల్లా SP రాజేష్ చంద్ర గురువారం తెలిపారు. పోలీసుల త్యాగాలు, విధుల్లో చూపించిన ప్రతిభను తెలిపే విధంగా తీసిన ఫోటోలను, 3 నిమిషాల లోపు తీసిన షార్ట్ ఫిల్మ్ ను పెన్ డ్రైవ్ రూపంలో అక్టోబర్ 23 లోపు కామారెడ్డి పోలీసు కార్యాలయంలో అందజేయాలన్నారు.
News October 17, 2025
NZB: 102 వైన్స్‌లకు దరఖాస్తులు ఎన్నంటే?

NZB జిల్లాలోని 102 వైన్ షాప్‌లకు సంబంధించి గురువారం వరకు 687 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. NZB ఫరిధిలోని మొత్తం 36 వైన్ షాపుల్లో 11 షాప్‌లకు 234 దరఖాస్తులు, BDN- మొత్తం18 వైన్ షాప్‌లకు 168, ARMR- 25 షాప్‌లకు 135, భీంగల్-12 వైన్ షాపులకు 65, మోర్తాడ్ పరిధిలో 11 వైన్ షాపులకు 85 దరఖాస్తులు వచ్చాయని ఆయన వివరించారు.