News March 10, 2025

సంగారెడ్డి: నేటి నుంచి ఇంటర్మీడియట్ వాల్యుయేషన్

image

సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఈనెల 10 నుంచి ఇంటర్మీడియట్ వాల్యూయేషన్ చేయనున్నట్లు జిల్లా అధికారి గోవిందారం తెలిపారు. 10న సంస్కృతం, 22న ఫిజిక్స్, 24న ఎకనామిక్స్, 26న కెమిస్ట్రీ, కామర్స్, 28న చరిత్ర, బాటని, జువాలజీ సబ్జెక్టుల వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.

Similar News

News February 12, 2026

KCRను జైల్లో వేయొచ్చు కానీ…: CM రేవంత్

image

TG: కాళేశ్వరం కేసును CBIకి అప్పగించినా ఎందుకు విచారించడం లేదో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని CM రేవంత్ డిమాండ్ చేశారు. ‘NDSA రిపోర్టు ప్రకారం మేడిగడ్డలో నీరు నింపితే కొట్టుకుపోయే ప్రమాదముంది. అలా జరిగితే మా ప్రభుత్వంపై నిందలు వేయాలని BRS చూస్తోంది. KCRను జైల్లో వేయొచ్చు కానీ ప్రొసీజర్ ప్రకారం నడుస్తాను. నాకు సొంత రాజ్యాంగం లేదు’ అని CM ఢిల్లీలో పేర్కొన్నారు.

News February 12, 2026

GWL: ప్రజా వ్యతిరేక పాలనపై కార్మిక గర్జన: ఐఎఫ్‌టీయూ

image

కార్మిక చట్టాలను కాలరాస్తూ, దేశ సంపదను దోచిపెడుతున్న పాలకులకు బుద్ధి చెప్పేందుకే ఈ సమ్మె అని ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్ పేర్కొన్నారు. FEB 12న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గద్వాల పాత బస్టాండ్ వద్ద జరిగిన నిరసనలో ఆయన మాట్లాడారు. లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, కాంట్రాక్ట్ వ్యవస్థను వీడి ప్రతి కార్మికుడిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.

News February 12, 2026

సిద్దిపేట: 10వ తరగతి మొదటి మైలురాయి: DEO

image

విద్యార్థి జీవితంలో 10వ తరగతి మొదటి మైలురాయని, దానిని ఏకాగ్రతతో అధిగమించాలని DEO శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం విపంచి కళానిలయంలో 10 విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చదువును ఇష్టపడి చదివితే కష్టం కాదన్నారు. ఈ విద్యా సంవత్సరం 10 పరీక్ష ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. బిస్మాట్ స్టేట్ సెక్రటరీ జగ్గు మల్లారెడ్డి ఉన్నారు.