News January 28, 2025
సంగారెడ్డి: నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో పనిచేస్తూ డీఆర్పీలుగా ఎంపికైన ఉపాధ్యాయులకు నేటి నుంచి రెండు రోజులపాటు ఐఎఫ్పీఎస్ పై హైదరాబాద్లోని టీఆర్ఆర్ రాజేంద్రనగర్లో శిక్షణ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. ఎంపికైన ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News January 5, 2026
కరీంనగర్: ఓటర్ల జాబితాలో ‘గందరగోళం’

కరీంనగర్ నగరపాలక సంస్థ ఓటర్ల జాబితా తప్పుల తడకగా తయారైంది. వార్డుల వారీగా కాకుండా పాత బూత్ల ప్రకారమే జాబితాను రూపొందించారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఒక డివిజన్ ఓటర్లు మరోచోట చేరారు. వెదురుగట్ట గ్రామ ఓటర్లు తీగలగుట్టపల్లి జాబితాలో ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ తప్పిదాలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తోంది. అధికారులు ఎప్పుడు సరిచేస్తారో వేచి చూడాలి.
News January 5, 2026
ఎండోమెట్రియోసిస్ ఉంటే పిల్లలు పుట్టరా?

మహిళల్లో ఎండోమెట్రియల్ లైనింగ్ మందంగా ఉంటే నెలసరిలో బ్లీడింగ్ ఎక్కువరోజులు కావడం, నొప్పి, స్పాటింగ్ వంటివి ఉంటాయి. దీన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. దీని తీవ్రతను బట్టి గర్భధారణ సమయంలో పలు ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్నవారిలో అబార్షన్, ప్రీటర్మ్ డెలివరీ వంటివి జరిగే అవకాశం ఉంటుంది. ✍️ ఎండోమెట్రియోసిస్ లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.
News January 5, 2026
WGL: మండలాల్లో ప్రజావాణికి పాతర..!

ప్రతి సోమవారం జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ప్రజావాణికి గ్రామాల నుంచి వినతులు ఎక్కువగా వస్తున్నాయని గత ప్రభుత్వం మండలాల్లోనూ ప్రజావాణిని నిర్వహించాలని నిర్ణయించింది. అయితే మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయాల్లో ప్రజావాణిని చేపట్టగా ఉమ్మడి WGL జిల్లాలోని పలు చోట్ల మూన్నాళ్ల ముచ్చటగా మారింది. బాధితులు జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లకు అనేక వ్యయ ప్రయాసాలకోర్చి వెళ్లాల్సి వస్తోంది.


