News January 30, 2025
సంగారెడ్డి: నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ

జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గురువారం నుంచి రెండు రోజుల పాటు కెరీర్ గైడెన్స్ పైన శిక్షణ ఇస్తున్నారు. సంగారెడ్డిలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ శిక్షణకు ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు హాజరు కావాలని చెప్పారు.
Similar News
News November 16, 2025
అది ఛేజ్ చేయగలిగే టార్గెటే: గంభీర్

టెస్టుల్లో ఆడాలంటే స్కిల్‌తో పాటు మెంటల్ టఫ్నెస్ ఉండాలని IND హెడ్ కోచ్ గంభీర్ అన్నారు. SAతో తొలి టెస్టులో <<18303459>>ఓటమి<<>> అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘124 ఛేజబుల్ టార్గెటే. పిచ్ ఆడేందుకు వీలుగానే ఉంది. ఇలాంటి పిచ్‌పై ఆడాలంటే టెక్నిక్, టెంపెరమెంట్ ఉండాలి. ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ వికెట్లు పడ్డాయి. మేం అడిగిన పిచ్‌నే క్యూరేటర్ తయారు చేశారు. బాగా ఆడనప్పుడు ఇలాగే జరుగుతుంది’ అని పేర్కొన్నారు.
News November 16, 2025
రేపు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న కలెక్టర్

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కలెక్టరేట్లో సోమవారం PGRSను నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.
News November 16, 2025
వరంగల్: వడ్డీ వ్యాపారుల గిరి గిరి తంతు..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫైనాన్స్ పేరుతో వడ్డీ వ్యాపారులు పేదలను తీవ్రంగా దోపిడీ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధిక వడ్డీలు విధించి చిన్న వ్యాపారుల నడ్డి విరుస్తున్నారు. కట్టలేకపోతే బెదిరింపులు, గొడవలు రోజువారీగా మారాయి. అనుమతులు లేకుండా రూ.కోట్ల లావాదేవీలు జరిపినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నారు. కానీ నియంత్రణ వ్యవస్థ నిమ్మకునీరెత్తనట్టుగా వ్యవహరిస్తోంది.


