News January 30, 2025
సంగారెడ్డి: నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ

జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గురువారం నుంచి రెండు రోజుల పాటు కెరీర్ గైడెన్స్ పైన శిక్షణ ఇస్తున్నారు. సంగారెడ్డిలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ శిక్షణకు ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు హాజరు కావాలని చెప్పారు.
Similar News
News February 18, 2025
1947లో ధరలిలా ఉండేవి!

డాలర్ విలువ ఒక రూపాయితో సమానంగా ఉండేది. 10 గ్రాముల బంగారం ధర రూ.88 మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగుల్లో అధిక జీతం రూ.2వేలు. చీపెస్ట్ కార్ రూ.2500. సౌత్ ఢిల్లీలో ఒక ఎకరం భూమి ధర రూ.17వేలు, ముంబైలో 2BHK రెంట్ రూ.20-50 మాత్రమే. బేసిక్ మెడికల్ టెస్టులు రూ.100- రూ.500. రూ.25కే సైకిల్ వచ్చేది. రూ.4కే కేజీ స్వచ్ఛమైన నెయ్యి. పెట్రోల్ ధరలు లీటర్‌కు 27 పైసలు.
News February 18, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ ఏసీబీకి పట్టుబడిన అటవీ అధికారులు✓ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భూభారతి చట్టం: మంత్రి పొంగులేటి✓ ప్రైవేటు స్కూల్ బస్ క్లీనర్ మృతి పట్ల ఆందోళన✓ భద్రాద్రిలో మిర్చి మార్కెట్ ఏర్పాటు చేయాలి ✓ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి:SFI ✓ ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం దంపతులు✓ వీధి కుక్కల నియంత్రణకు ఇల్లందులో స్పెషల్ డ్రైవ్ ✓ భద్రాచలంలో ఆక్రమిత ప్రభుత్వ భూమి స్వాధీనం
News February 18, 2025
BREAKING: ఫలితాలు విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CHSL-2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. 2024 APRలో ఈ నోటిఫికేషన్ విడుదలవ్వగా జులైలో టైర్-1, NOVలో టైర్-2 ఎగ్జామ్స్ నిర్వహించారు. మొత్తం 3,954 పోస్టులు ఉన్నాయి. తాజాగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల వివరాలను సైట్‌లో పొందుపర్చింది. వీరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత నియామక ప్రక్రియ పూర్తవుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <