News January 19, 2026

సంగారెడ్డి: నేటి నుంచి కొత్త సర్పంచ్‌లకు శిక్షణ

image

జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు 19 నుంచి మార్చి 8 వరకు విడుతల వారీగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం తెలిపారు. బైపాస్ రహదారిలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో శిక్షణ తరగతులు జరుగుతాయని చెప్పారు. బ్యాచ్‌కు 100 మంది చొప్పున మొత్తం ఆరు బ్యాచ్‌లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.

Similar News

News February 14, 2026

తొర్రూర్: 2 సార్లు ఓటమి.. 3వ సారి గెలుపు!

image

తొర్రూర్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో అభ్యర్థుల మధ్య గట్టి పోటీ జరిగింది. గతంలో కాంగ్రెస్ నుంచి 2013లో భార్య, 2020లో భర్త పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి భార్య ఎన్నికల బరిలోకి దిగి, బీఆర్ఎస్ అభ్యర్థిపై 241 ఓట్ల మెజారిటీతో గెలిచి, కౌన్సిల్ స్థానాన్ని సాధించింది. 2 సార్లు ఓడినా, 3వ సారి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కాగా, గతంలో తన ప్రత్యర్థి కూడా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు.

News February 14, 2026

GNT: కన్నీళ్లు తెప్పిస్తున్న.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు

image

ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కొన్ని సెంటర్లు ప్రజలకు కంటతడి పెట్టిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో రక్షణ లేకుండా ఫుడ్ తయారీ చేస్తున్నారు. ఫుడ్‌లో వినియోగించే స్పైసెస్ గాలికి రోడ్డుపై ప్రయాణించే వారి కళ్లల్లో పడి ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో చేసేది లేక కళ్లు తుడుచుకొని వెళ్తున్నారు. నిర్వాహకులు, అధికారులు జాగ్రత్తలు పాటిస్తే మేలని అంటున్నారు. దీనిపై మీ కామెంట్.

News February 14, 2026

ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి: పుట్టపర్తి కలెక్టర్

image

పుట్టపర్తి కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్యాంప్రసాద్ జిల్లాలోని అని నియోజకవర్గాల ఎన్నికల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ప్రక్రియ ముందస్తు చర్యలు, రోజువారి క్లెయిమ్స్ అభ్యంతరాల పరిష్కార స్థితిపై సమీక్షించారు. పెండింగ్‌లోని క్లెయిమ్స్‌ను పరిష్కరించి సమగ్ర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల అధికారులుందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.