News February 17, 2025

సంగారెడ్డి: నేటి నుంచి విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు

image

పాఠశాలలో చదివే విద్యార్థులకు నేటి నుంచి మార్చి 15వరకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి సోమవారం. సంగారెడ్డి జనరల్ హాస్పిటల్, జోగిపేట, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్‌లో కంటి వైద్య పరీక్షలు జరుగుతాయని చెప్పారు. మొబైల్ హెల్త్ టీం వాహనాల్లో రోజుకు 50 మంది విద్యార్థులు తరలించి కంటి వైద్య పరీక్షలు చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News November 24, 2025

అధిక ధరలకు అమ్మితే కాల్ చేయండి!

image

బస్‌స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, సూపర్ మార్కెట్స్ వంటి చోట్ల కొందరు MRP కంటే అధిక ధరలకు వస్తువులు అమ్ముతుంటారు. అలాంటి సమయంలో ప్రశ్నించడం వినియోగదారుడిగా నీకున్న హక్కు. ఒకవేళ ఎవరైనా అధిక ధర వసూలు చేస్తే అది చట్ట ప్రకారం నేరం. ఇలాంటి మోసాలను వెంటనే నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ నం.1915కు కాల్ లేదా WhatsApp No 8800001915కు మెసేజ్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. SHARE IT

News November 24, 2025

HYD: డిజిటల్ ప్రపంచంలో భద్రత తప్పనిసరి: సీపీ

image

హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలకు కీలక సూచన చేశారు. ‘డిజిటల్ ప్రపంచంలో భద్రత తప్పనిసరి. మీ డేటా, మీ జీవితానికి కీలకం. దాన్ని మీరే కాపాడుకోవాలి. డేటా చోరీ జరిగితే, ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1930కు కాల్ చేయండి. లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి’ అని Xలో ట్వీట్ చేశారు.

News November 24, 2025

అర్జీల ఆన్లైన్‌లో నమోదు చేయాలి: ప్రకాశం కలెక్టర్

image

ఒంగోలు కలెక్టర్ రాజాబాబు కలెక్టర్ మీకోసం అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ మీకోసం అనంతరం ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ‘ప్రతి అర్జీదారుడుతో అధికారులు మర్యాదపూర్వకంగా మెలిగి వారి సమస్యను పూర్తిస్థాయిలో తెలుసుకోవాలన్నారు. ప్రతిరోజు IVRS కాల్ ద్వారా అర్జీదారులతో మాట్లాడడం జరుగుతుంది’ అని అన్నారు.