News February 24, 2025
సంగారెడ్డి: నేడు పది పరీక్షలపై శిక్షణ: డీఈవో

సంగారెడ్డి జిల్లా పదవ తరగతి పరీక్షలకు సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని నేడు ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించే చీఫ్ సూపరింటెండ్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు శిక్షణకు హాజరుకావాలని చెప్పారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి హాజరవుతారని పేర్కొన్నారు.
Similar News
News October 23, 2025
పాలమూరు: చెక్ పోస్ట్‌లకు చెక్.. సర్వత్రా హర్షం

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని హైవేలపై ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. సిబ్బంది వసూళ్ల బాధల నుంచి తమకు విముక్తి కల్పించినందుకు పలువురు వాహనాల యజమానులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.కాగా, ఆ చెక్ పోస్టులు కేవలం కలెక్షన్ కేంద్రాలుగామారిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో వాటిని తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
News October 23, 2025
DMRCలో ఉద్యోగాలు

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(DMRC)18 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్, బీఈ, డిప్లొమా, ఇంటర్, టెన్త్, సీఏ, ICWA ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://delhimetrorail.com/
News October 23, 2025
రాజంపేట పోలీస్ స్టేషన్‌లో SP తనిఖీ

అన్నమయ్య జిల్లా SP ధీరజ్ బుధవారం రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, సిబ్బంది పనితీరు, పరిశుభ్రతను సమీక్షించి సూచనలు జారీ చేశారు. బాధితులకు త్వరగా న్యాయం అందించేలా కేసులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెంచాలని సూచించారు. గస్తీ చర్యలు, క్రమశిక్షణ, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు.