News June 14, 2024
సంగారెడ్డి: నేడు పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసాలు
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా నేడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహింస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Similar News
News September 8, 2024
కాంగ్రెస్ పాలనలో 475 మంది రైతుల ఆత్మహత్య: హరీష్ రావు
కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని మండిపడ్డారు. అందరికీ రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పారని, కాని రైతులు రుణమాఫీ కాక తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోకపోవడంతో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
News September 8, 2024
సంగారెడ్డి: 10న న్యాస్ సన్నాహక పరీక్ష
సంగారెడ్డి జిల్లాలోని 3, 6, 9 తరగతుల విద్యార్థులకు ఈనెల 10న న్యాస్ సన్నాహక పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు ఇప్పటికే పాఠశాలలకు పంపించినట్లు చెప్పారు. విద్యార్థులకు న్యాస్ పరీక్ష నిర్వహించి జవాబు పత్రాలు మళ్లీ మండల విద్యాధికారి కార్యాలయానికి పంపించాలని సూచించారు.
News September 8, 2024
మెదక్ జిల్లాలో విషాదం.. ఇల్లు కూలి మహిళ మృతి
మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. టేక్మాల్‌లో ఇల్లు కూలడంతో నిద్రిస్తున్న మహిళ చనిపోయింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దత్తయ్య, శంకరమ్మ(60) దంపతులు శనివారం ఇంట్లో పడుకున్నారు. ఇటీవల వర్షాలతో నానిన వారి ఇల్లు కూలడంతో శంకరమ్మ నిద్రలోనే మృతిచెందింది. భర్త దత్తయ్య మరో గదిలో పడుకోవడంతో ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.