News January 29, 2025
సంగారెడ్డి: నేడు పాఠశాల స్థాయిలో ప్రతిభ పోటీలు: డీఈవో

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కస్తూర్భా, ఆదర్శ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు సైన్స్ ప్రతిభ పోటీలను బుధవారం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను ఎంపిక చేసి ఈ నెల 31వ తేదీన జరిగే మండల స్థాయి పోటీలకు పంపించాలని సూచించారు.
Similar News
News December 9, 2025
7వేల రిజిస్ట్రేషన్లే పెండింగ్: మంత్రి నారాయణ

AP: రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ చెప్పారు. 66K ప్లాట్లలో 7K మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉందన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ కూడా పూర్తవుతుందని, రైతులు ముందుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. లంక భూములు, అసైన్డ్ భూముల సమస్యలను వచ్చే మంత్రివర్గ సమావేశంలో పరిష్కరిస్తామన్నారు. రాజధానిలో జరుగుతున్న పనులను ఆయన ఇవాళ పరిశీలించారు.
News December 9, 2025
పోస్టర్ రగడ.. ‘కుంభ’గా రేవంత్ రెడ్డి

TG: ‘వారణాసి’ సినిమాలోని విలన్(కుంభ) పాత్రలో CM రేవంత్ ఉన్నట్లుగా పోస్టర్ క్రియేట్ చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీనిని తాజాగా BJP షేర్ చేయడం వివాదానికి ఆజ్యం పోసినట్లైంది. భారతదేశంలో ఎమర్జెన్సీ మైండ్సెట్ ఇంకా సజీవంగానే ఉందని మండిపడింది. రేవంత్ ప్రభుత్వం నియంతృత్వ వైఖరి అవలంబిస్తోందని, అవినీతి పాలన కొనసాగిస్తోందని X వేదికగా బీజేపీ విమర్శలు గుప్పించింది.
News December 9, 2025
వాహనదారులారా.. రూల్స్ అతిక్రమించకండి: ఎస్పీ

అనంతపురం జిల్లా పోలీస్ అధికారులకు ఎస్పీ జగదీశ్ పలు సూచనలు చేశారు. వాహనదారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. వేగం, ప్రమాదకర డ్రైవింగ్, మద్యం మత్తు, నిద్రమత్తు డ్రైవింగ్ను పూర్తిగా నివారించాలన్నారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు, రోడ్డు సంకేతాలను వాహనదారులు కచ్చితంగా పాటించాలన్నారు. బండి పత్రాలు ఉండాలని, హెల్మెట్/సీటు బెల్ట్ తప్పనిసరిగా వాడలని, లేనిచో చట్టపరంగా చర్యలు చేపడతామని హెచ్చరించారు.


