News March 31, 2025
సంగారెడ్డి: నేడు ప్రజావాణి కార్యక్రమం రద్దు.!

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో నేడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేడు రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కాబట్టి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News December 22, 2025
ఖమ్మంలో ‘శిల్పారామం’

ఖమ్మంలో శిల్పారామం ఏర్పాటుకు ముహూర్తం కుదిరింది. ఖానాపురం హవేలీ పరిధిలోని సర్వే నం. 94, 234లో 5.04 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు అధికారులు పరిశీలన పూర్తి చేశారు. శిల్పారామం ముఖద్వారానికి సంబంధించిన నమూనాను తక్షణమే సిద్ధం చేసి, పనులను పట్టాలెక్కించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరం పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది.
News December 22, 2025
శ్రీకాకుళం జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ దందా

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ అండతో కొందరు మాఫియాగా మారి ఇసుక అక్రమ దందా సాగిస్తున్నారు. శివారు గ్రామాలను డంపింగ్ కేంద్రాలుగా మార్చి గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో భారీ లారీలతో ఒడిశా, హైదరాబాద్లకు రవాణా చేస్తున్నట్లు ఊహగానాలున్నాయి. దీంతో నదీ పరీవాహక భూములు కోతకు గురవుతున్నాయి. అధికారికంగా 27 ర్యాంపుల్లో 4.50లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలగా, అనధికారకంగా లక్షల క్యూబిక్ మీటర్లు తరలిందని సమాచారం.
News December 22, 2025
అన్నమయ్య: రేపు బంద్

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని ఆ ప్రాంత వాసులు పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు. రేపు రాజంపేట బంద్కు JAC నేతలు పిలుపునిచ్చారు. ఈ బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాజంపేటకు ద్రోహం చేసిన YCP ఎమ్మెల్యే, MPలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. YCP అన్యాయం చేసింది మీరైనా న్యాయం చేయండి అంటూ CM చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.


