News January 29, 2025
సంగారెడ్డి: నేడే ఆఖరి తేది: డీఈవో

సంగారెడ్డి జిల్లాలోని ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్లో ప్రవేశం పొందేందుకు గడువు ఇవాళతో ముగియనుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంకెవరైనా విద్యార్థులు ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లో సంప్రదించాలని పేర్కొన్నారు.
Similar News
News December 15, 2025
సిద్దిపేటలో బీఆర్ఎస్ 78 సీట్లు కైవసం

సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 91 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. బీఆర్ఎస్ 78 సీట్లు కైవసం చేసుకోగా అధికార కాంగ్రెస్ 5 పంచాయతీ స్థానాలు వెల్కటూర్, బూరుగుపల్లి, రాంపూర్, నాగరాజు పల్లి, బచ్చాయిపల్లిలో గెలిచింది. బీజేపీ 2 పంచాయతీ స్థానాలు చందలా పూర్, నాంచారుపల్లి గెలవగా ఇండిపెండెంట్ -6 తడకపల్లి, అల్లీపూర్, కోదండరావుపల్లి, సిద్దన్నపేట, ఖానాపూర్, రాజ్ గోపాల్ పేట్ గెలుపొందారు.
News December 15, 2025
ఇవాళ కన్హా శాంతివనానికి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ శంషాబాద్‌లోని కన్హా శాంతివనాన్ని సందర్శించనున్నారు. ఉదయం 11గంటలకు జూబ్లీహిల్స్ నుంచి బయలుదేరి శాంతి వనం అధ్యక్షుడితో భేటీ కానున్నారు. తర్వాత యోగా, వెల్‌నెస్ సెంటర్లను పరిశీలించనున్నారు. అనంతరం అమరావతికి బయలుదేరుతారు. సాయంత్రం విజయవాడలో జరిగే పొట్టిశ్రీరాములు ఆత్మార్పణదినం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కాగా కన్హా శాంతివనం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రాలలో ఒకటిగా ఉంది.
News December 15, 2025
దురదృష్టం.. ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేసినా

TG: సూర్యాపేటలోని గుడిబండ గ్రామంలో ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన వెంకటేశ్వర్లుకు దురదృష్టం వెంటాడింది. కేవలం పది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మంత్రి ఉత్తమ్, ఆయన సతీమణి పద్మావతి వ్యక్తిగతంగా మద్దతు తెలిపినా వెంకటేశ్వర్లుకు పరాజయం తప్పలేదు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నాగయ్య చేతిలో ఓడారు. వెంకటేశ్వర్లు పదవీకాలం మరో 5 నెలల్లో ముగియనుండగా VRS తీసుకొని పోటీ చేశారు.


