News February 15, 2025
సంగారెడ్డి: నేను పుస్తకాలు చదవలేదు: జగ్గారెడ్డి

యువతకు ఉపయోగపడే ఐటీఐఆర్ ప్రాజెక్టు తీసుకురావాలని తాను బీజేపీ ఎంపీలకు అడిగితే.. తనకు ఐటీఐఆర్ ఫుల్‌ఫాం తెలియదంటూ ఎద్దేవా చేయడం ఎంపీ రఘునందన్‌రావుకు తగదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. నిజంగా తాను పుస్తకాలు చదువుకోలేదని కేవలం ప్రజల మనస్తత్వం మాత్రమే చదివానని చెప్పారు. గాంధీ భవన్‌లో మీడీయాతో ఆయన మాట్లాడుతూ.. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కందికి ఐఐటీ తీసుకువచ్చానన్నారు.
Similar News
News November 15, 2025
మెదక్: హోమ్ గార్డ్ సిబ్బంది సంక్షేమంపై సమీక్ష

హోమ్ గార్డ్ సిబ్బంది సంక్షేమార్థం యాక్సిస్ బ్యాంక్ అధికారులతో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ సమీక్షించారు. హోమ్ గార్డుల ఆర్థిక భద్రత, సామాజిక సంక్షేమం లక్ష్యంగా సమీక్ష చేశారు. హోమ్ గార్డులు జిల్లా పోలీస్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రజల రక్షణలో ఎల్లప్పుడు ముందుంటున్న ఈ సిబ్బందికి అవసరమైన సహాయం, మార్గదర్శక, సంక్షేమ కార్యక్రమాలను అందించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు.
News November 15, 2025
తూప్రాన్: మహిళ ఆత్మహత్య

తూప్రాన్ పట్టణంలో మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన బుట్టి అమృత (52) మానసిక స్థితి సరిగా లేక ఈనెల 12న క్రిమిసంహారక మందు తాగింది. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News November 15, 2025
మెదక్: గ్రామాల్లో బెంబేలెత్తిస్తున్న వీధికుక్కలు!

వీధి కుక్కల బెరద రోజు రోజుకు గ్రామాల్లో అధికమవుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా మంది వీధి కుక్కల బారిన పడిన వారు ఉన్నారు. అయితే కుక్కల కాటు వల్ల రేబిస్ వ్యాధి వస్తుందని డాక్టర్లు కుక్కల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గ్రామాల్లో ఒక్కో కుక్క గుంపులో సుమారు 20 నుంచి 30 కుక్కల సంచారిస్తున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్ట్ వీధి కుక్కలను నియంత్రించాలని ప్రభుత్వానికి ఆదేశించింది.


