News March 10, 2025

సంగారెడ్డి: న్యాయమూర్తిని కలిసిన నూతన ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పారితోష్ పంకజ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా జిల్లా న్యాయమూర్తి భవాని చంద్రను ఎస్పీ కలిశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.

Similar News

News March 11, 2025

నరసారావుపేట మాజీ MLAపై కంప్లైంట్

image

నరసారావుపేట మాజీ MLA గోపిరెడ్డి, మాజీ MP విజయసాయి రెడ్డిపై మాజీ కౌన్సిలర్ నాగజ్యోతి, టీడీపీ కార్యకర్తలు 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాజీ స్పీకర్ కోడెల, అతని కుమారునిపై కేసులు పెట్టి వేధించారని పేర్కొన్నారు. అప్పట్లో శ్రీకాకుళం వాసి నాగరాజు తన వద్ద కోడెల రూ. 15 లక్షలు లంచం తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మాజీ MP, మాజీ MLA ఒత్తిడితోనే చేశానని ఒప్పుకున్నారు.

News March 11, 2025

మహబూబాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత!

image

మహబూబాబాద్ జిల్లాలో ఎండ భగ్గుమంటోంది. జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేవారు ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే వడగాలులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఈరోజు 34 నుంచి 37 డిగ్రీలు, రేపు 34-38 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే చెక్ డ్యామ్‌లు, బోరుబావులు ఎండిపోయాయి.

News March 11, 2025

గద్వాల: చేతికొచ్చిన పంటను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యం: మంత్రి 

image

చేతికొచ్చిన పంటను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం అంబేడ్కర్ తెలంగాన సచివాలయం నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. అధికారులు సమన్వయంతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతాంగానికి తోడ్పాటునందించాలని సూచించారు. గద్వాల నుంచి కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

error: Content is protected !!