News March 10, 2025
సంగారెడ్డి: న్యాయమూర్తిని కలిసిన నూతన ఎస్పీ

సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పారితోష్ పంకజ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా జిల్లా న్యాయమూర్తి భవాని చంద్రను ఎస్పీ కలిశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.
Similar News
News February 9, 2026
సిరిసిల్ల: విద్యాసంస్థలకు సెలవు.. ఎప్పుడంటే?

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ స్థానిక సెలవులను ప్రకటించారు. పోలింగ్ కేంద్రాలుగా ఉన్న విద్యాసంస్థలకు ఫిబ్రవరి 10న సెలవు ఉంటుంది. ఇక పోలింగ్ రోజైన ఫిబ్రవరి 11న రెండు మున్సిపాలిటీల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థలకు సెలవు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News February 9, 2026
ASF: ఈ నెల 20 వరకే కొనుగోళ్లు

2025–26 పత్తి సీజన్‌కు సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పత్తి కొనుగోళ్లు ఫిబ్రవరి 20, 2026తో ముగుస్తాయని జిల్లా మార్కెటింగ్ శాఖ తెలిపింది. ఈ తేదీ తర్వాత ఆసిఫాబాద్ జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు నిలిపివేస్తామని పేర్కొంది. రైతులు కాపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకొని ఫిబ్రవరి 20లోపు పత్తిని విక్రయించాలని అధికారులు సూచించారు.
News February 9, 2026
తిర్యాణిలో మావోయిస్టుల కదలికలు!

తిర్యాణి అడవుల్లో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ఓ మావోయిస్టు దళం జిల్లాలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాల సమాచారం. దీంతో పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గాలింపు చేపట్టాయి. డోర్లి-పంగిడిమాదారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన కిట్ బ్యాగులు, సామగ్రిని గుర్తించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.


