News August 1, 2024

సంగారెడ్డి: న్యాయవాదుల క్రీడలు ప్రారంభించిన జిల్లా జడ్జి

image

సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో న్యాయవాదుల క్రీడలను జిల్లా జడ్జి భవాని చంద్ర గురువారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. క్రీడల వల్ల మానసిక ప్రశాంతత వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శి అశోక్, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Similar News

News December 9, 2025

MDK: ఉత్సాహంతో యువత గ్రామ పోరులోకి

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోరుకు యువత రంగంలోకి దిగింది. ప్రస్తుత తరుణంలో రాజకీయాలపై ఇష్టన్నీ, బాధ్యతను గుర్తించిన యువత ఈసారి జరగనున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషించునున్నారు. గ్రామ అభివృద్ధికి మేము సైతం అంటూ ముందుకు కదులుతున్నారు. ప్రశ్నించే గొప్ప తత్వాన్ని అలవర్చుకొని, ప్రజాసేవలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. డబ్బు, మద్యం లేని ఈ రాజకీయాల్లో రాణిస్తారో, లేదో!

News December 9, 2025

మెదక్ : సభలు, ర్యాలీలపై నిషేధం: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ప్రచారం 9 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పోలింగ్‌కు 44 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ అమలులోకి రానుంది. ఈ సమయంలో సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచారాలు నిషేధం. ఇతర ప్రాంతాల వారు పంచాయతీ పరిధిలో ఉండరాదు. ఉల్లంఘనలు గమనిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

News December 9, 2025

మెదక్: నేడు 5 గంటల వరకే ప్రచారం: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ మెదటి విడత ఎన్నికల ప్రచారం నేడు సాయంత్రం 5 గంటలకు తెరపడనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి ఆయా మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు వెళ్లాలన్నారు.