News February 10, 2025
సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సమీక్ష

పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ వల్లూరు క్రాంతి కలెక్టరేట్లో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో డీపీఓ సాయి బాబా, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, డీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Similar News
News November 23, 2025
HYD రూపురేఖలు మార్చేసే ‘హిల్ట్’ పాలసీ!

హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (HILTP)కి ఆమోదం తెలిపింది. దీని ద్వారా బాలానగర్, కటేదాన్ వంటి నిరుపయోగ పారిశ్రామిక భూములను మల్టీ యూజ్ జోన్లుగా మారుస్తారు. ఈ స్థలాల్లో ఇకపై నివాస, వాణిజ్య, ఐటీ నిర్మాణాలకు అనుమతి ఉంటుంది. స్థలం వెడల్పును బట్టి SRO ధరల్లో 30%- 50% డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు (DIF) చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు 6 నెలల్లోపు TG IPASS ద్వారా సమర్పించాలి.
News November 23, 2025
కోటంరెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ భేటీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం ఉదయం భేటీ అయ్యారు. మాగుంట లేఔట్లోని కోటంరెడ్డి కార్యాలయానికి నారాయణ వచ్చారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెడతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
News November 23, 2025
స్పీకర్ నోటీసులపై స్పందించిన దానం

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై విచారణకు హాజరుకావాలన్న స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. వివరణ ఇచ్చేందుకు నేటితో గడువు ముగియనుండటంతో మరి కొంత సమయం కావాలని కోరుతూ స్పీకర్కు లేఖ రాశారు. కాగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు, తాజా పరిస్థితులపై కాంగ్రెస్ నేతలను ఆయన కలిసి చర్చించినట్లు సమాచారం.


