News February 10, 2025
సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికలపై రిటర్నింగ్ అధికారులకు శిక్షణ

జిల్లాలోని పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రేపు రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణఖేడ్ డివిజన్ వారికి కన్వెన్షన్ హాల్, జుకలు, జహీరాబాద్ డివిజన్ వారికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జహీరాబాద్, సంగారెడ్డి డివిజన్ వారికి సమీకృత కలెక్టరేట్ సంగారెడ్డి నందు శిక్షణ ఇవ్వనున్నారు.
Similar News
News April 19, 2026
నెల్లూరు: ఉప్పు కాలువలో పడి వ్యక్తి మృతి.. ఇతను మీకు తెలుసా?

తోటపల్లి గూడూరు మండలం కొత్త పట్టపుపాలెం వద్ద ఉన్న ఉప్పు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి పడి మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం సాయంత్రం తెలిపారు. మృతుడి వయస్సు 40 ఏళ్లు ఉండవచ్చు. అతని ఎడమ చేతి మీద గిరిజ అని పచ్చ బొట్టు ఉంది. గోధుమ రంగు కలర్ పై బ్లూ, పింక్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఉన్న ఫుల్ షర్ట్, తెల్లటి బనియన్, నల్లని నైట్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.

సింహాచలం: అందరికీ స్వామి నిజరూప దర్శన భాగ్యం కలిగేనా?

రేపు జరిగే చందనోత్సవం ఏర్పాట్లపై కొంత అనిశ్చితి నెలకొంది. లక్షా ఇరవై వేల నుంచి రెండు లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, గంటకు 5-6 వేల మందికే దర్శనం సాధ్యమని అంచనా. దీంతో వచ్చిన వారందరికీ స్వామి నిజరూప దర్శన భాగ్యం కష్టమే అన్న భావన కలుగుతోంది. టికెట్‌ల కేటాయింపు, VIP దర్శనాలపై కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది అనుభవాల నేపథ్యంలో ఈసారి ఏర్పాట్లు అధికారులకు సవాల్‌గా మారాయి.