News March 23, 2025
సంగారెడ్డి: పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ చేసిన కలెక్టర్

సదాశివపేట మండలం నాగసాన్ పల్లి పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం జారీ చేశారు. గ్రామంలో ఫైనల్ నోటిఫికేషన్ చేయకుండానే వెంచర్లకు అనుమతి ఇచ్చారని, కొందరు డీపీవోకు ఫిర్యాదు చేశారు. డీపీవో విచారణ నివేదిక ఆధారంగా పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News April 21, 2025
ఈ ఏడాది చివరికల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి: నిమ్మల

AP: పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రెండు కట్టర్లు, రెండు గ్రాబర్లతో 202 మీటర్లకు పైగా నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. ఈ నెల 30 నాటికి మూడో కట్టర్ కూడా అందుబాటులోకి వస్తుందని, ఈ ఏడాది చివరికల్లా వాల్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని వివరించారు.
News April 21, 2025
ఎచ్చెర్ల: డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ ఫలితాలు విడుదల

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ ఫలితాలను నేడు యూనివర్సిటీ డీన్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ..ఈ ఫలితాలను https://jnanabhumi.ap.gov.in/ వెబ్ సైట్‌లో చూడాలని చెప్పారు. డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 24వ తేదీ నుంచి జరుగుతాయని తెలిపారు.
News April 21, 2025
బీటెక్, MBA చేసినా నిరుద్యోగులుగానే!

భారతదేశంలో గ్రాడ్యుయేట్ల పరిస్థితిపై ‘అన్‌స్టాప్’ నివేదిక విడుదల చేసింది. దాదాపు 83% మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, 50శాతం మంది MBA గ్రాడ్యుయేట్లు ఎలాంటి ఉద్యోగం, ఇంటర్న్‌షిప్ పొందలేదని తెలిపింది. 2024లో ఇంటర్న్‌షిప్ పొందిన వారిలోనూ నలుగురిలో ఒకరిని ఫ్రీగా పనిచేయించుకున్నట్లు పేర్కొంది. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే విధంగా విద్యా సంస్థలు కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.