News March 4, 2025
సంగారెడ్డి: పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు

జిల్లాలో ఈనెల 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. సంగారెడ్డిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మొత్తం 54 కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం 16,513, ద్వితీయ సంవత్సరం 18,101 విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రంలో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 18, 2025
రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్

వైసీపీఅధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ బుధవారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో పర్యటించనున్నారు. ఉదయం 9.30కు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు. అక్కడ వైసీపీ పార్లమెంటరీ పార్టీనేత వైవీ సుబ్బారెడ్డి నివాసానికి చేరుకుని, ఆయన మాతృమూర్తి యర్రం పిచ్చమ్మ (85) పార్దివ దేహానికి నివాళులర్పిస్తారు. వైవీ కుటుంబ సభ్యులను పరామర్శించిన అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.
News March 18, 2025
అందుకే 24ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్నా: పార్తీబన్

నటి సీతతో విడాకుల తర్వాత ఇప్పటివరకూ పెళ్లి చేసుకోలేదని నటుడు R.పార్తీబన్ అన్నారు. భార్యగా వేరొకరికి స్థానం ఇవ్వలేనని, అందుకే ఒంటరిగా ఉంటున్నానని ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. సీతతో ఇప్పుడు టచ్‌లో లేనని, ఆమె తల్లి చనిపోయినప్పుడు మాత్రం అంత్యక్రియలు జరిపానని అన్నారు. 1990లో వీరు వివాహం చేసుకోగా 2001లో విడాకులు తీసుకున్నారు. సీత 2010లో మరో పెళ్లి చేసుకుని 2016లో విడిపోయారు.
News March 18, 2025
MBNR: కట్నం వేధింపులతో ఆత్మహత్య.. తల్లి ఫిర్యాదు

జడ్చర్ల మండలంలో నవవధువు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకి చెందిన చర్చిత(23)కు రాళ్లగడ్డతండాకు చెందిన పవన్‌తో జనవరి31న పెళ్లి జరిగింది. వధువు తల్లిదండ్రులు పెళ్లికి రావాలంటే రూ.10లక్షలు వరకట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేయటంతో వారు పెళ్లికి రాలేదు. పెళ్లి తర్వాత అత్త, మామలు వేధింపులకు గురిచేయటంతో చర్చిత ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి రాధిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.