News February 23, 2025
సంగారెడ్డి: పదిలో 100% ఉత్తీర్ణత సాధించాలి: జిల్లా కలెక్టర్

రామచంద్రపురం మండలం వెల్మెల ఆదర్శ పాఠశాలను కలెక్టర్ వల్లూరి క్రాంతి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పరిసరాలను, విద్యార్థులు చదువుతున్నా తీరును పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Similar News
News October 26, 2025
నాతో పార్టీ పెట్టించే అవసరం కేసీఆర్కు లేదు: కవిత

TG: తనతో పార్టీ పెట్టించే అవసరం కేసీఆర్కు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా NZBలో మీడియాతో మాట్లాడారు. ‘అందరికీ మంచి జరగాలనే జనం బాట చేపట్టాం. రాజకీయ పార్టీ అవసరమైతే పెడతాం. నన్ను బయటికి పంపి పార్టీ పెట్టించే అవసరం KCRకు లేదు. KCRను, BRSను ఇష్యూ బేస్డ్గానే విమర్శిస్తాను. కాంగ్రెస్ ఓ మునిగిపోయే నావ. ఆ పార్టీ నాకు మద్దతు ఇవ్వటమేంటి?’ అని వ్యాఖ్యానించారు.
News October 26, 2025
కృష్ణా: జిల్లాలో మండల ప్రత్యేక అధికారుల నియామకం

మొంథా తుపాన్ పరిస్థితులను అంచనా వేసేందుకు గాను జిల్లాలోని 25 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని సజావుగా తుపాన్ ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
News October 26, 2025
వనపర్తి: ఆర్టీసీ సేవలు వినియోగించుకోండి- DM

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వనపర్తి డిపో నుంచి ఈనెల 27, 28, 29వ తేదీల్లో 30 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ఈనెల 28న ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం రోజున వనపర్తి, కొత్తకోట నుంచి 20 బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. కాబట్టి భక్తులు ఆర్టీసీ బస్సుల సేవలను వినియోగించుకుని సురక్షితంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆయన కోరారు.


