News February 23, 2025

సంగారెడ్డి: పది ఇంటర్నల్ మార్కులను నమోదు చేయాలి: డీఈవో

image

జిల్లాలోని అన్ని రకాల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను https://bse.telangana.gov.in అనే వెబ్సైట్లో స్కూల్ లాగిన్ ద్వారా ఈ నెల 28వ తేదీలోగా నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఈ విషయాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు.

Similar News

News February 24, 2025

నర్సింహులపేట: జ్యోతిష్యం పేరుతో మోసం!

image

జ్యోతిష్యం పేరుతో బాబా వేషంలో వచ్చిన వ్యక్తులు బంగారం కాజేసిన ఘటన పెద్ద వంగర మండలం ఉప్పరగూడెంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన సముద్రాల శోభ ఇంటికి ఇద్దరు బాబా వేషాధరణలో వచ్చిన వ్యక్తులు, మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా అంటూ మాటలు కలుపుతూ శోభపై మొత్తం ముందు చల్లారు. శోభ ధరించిన బంగారాన్ని కాజేశారు. ఫోటో ఆధారంగా శోభ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News February 24, 2025

సిద్దిపేట: రాజీవ్ రహదారిపై యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

చిన్నకోడూర్ మండలం మల్లారంలో రాజీవ్ రహదారిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. అతడి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. 

News February 24, 2025

వరంగల్: నేటి ప్రజావాణి రద్దు

image

వరంగల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల, గ్రామాల ప్రజలు సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ రావద్దని ఆమె సూచించారు.

error: Content is protected !!