News March 8, 2025

సంగారెడ్డి: పది హాల్ టికెట్లు విడుదల: డీఈవో

image

జిల్లాలోని ఈ నెల 21 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ హాల్ టికెట్లను https://bse.telangana.gov.in/ అనే వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Similar News

News November 21, 2025

ఇందిరా గాంధీ స్టేడియానికి అంతర్జాతీయ హంగులు.!

image

అంతర్జాతీయ క్రీడల నిర్వహణ కోసం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియాన్ని ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2026 చివరి నాటికి ఆధునీకరించి, 2029లో అంతర్జాతీయ క్రీడలు నిర్వహించడమే లక్ష్యం. అంచనా వ్యయం రూ.53 కోట్లు మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ హాల్, బాక్సింగ్ ఎరీనా, అదనపు సింథటిక్ ఔట్డోర్ కోర్టులు, వసతి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.

News November 21, 2025

యాషెస్ సిరీస్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్

image

యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
☛ AUS XI: ఖవాజా, వెదరాల్డ్, లబుషేన్, స్మిత్(C), హెడ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, లియాన్, బ్రెండన్ డాగెట్, బోలాండ్
☛ ENG XI: డకెట్, క్రాలే, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్(C), J స్మిత్, అట్కిన్సన్, కార్స్, ఆర్చర్, వుడ్
☛ LIVE: స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్

News November 21, 2025

అక్రమ కేసులకు బెదిరేది లేదు: హరీశ్‌రావు

image

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కేసులు పెట్టడం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అణచివేసే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కోడిగుడ్డుపై ఈకలు పీకుతోందని తీవ్రంగా విమర్శించారు.