News March 12, 2025
సంగారెడ్డి: ‘పరీక్షకు 352 మంది విద్యార్థులు గైర్హాజరు’

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో 96.81% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.16,727 మంది విద్యార్థులకు గాను 16,375 మంది విద్యార్థులు హాజరయ్యారని, 352 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
Similar News
News February 24, 2026
కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్!

ఝార్ఖండ్‌లోని రాంచీలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. ఏడుగురితో ఢిల్లీకి బయల్దేరిన కాసేపటికే ఛత్రా జిల్లాలోని కర్మటండ్ గ్రామంలో క్రాష్ అయింది. ఒకరు చనిపోయారని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
News February 24, 2026
రక్షణ రంగ అభివృద్ధికి ఏపీ కీలకం: జి. సతీష్ రెడ్డి

విశాఖ డిఫెన్స్ స్టార్టప్ సదస్సులో రక్షణ శాస్త్రవేత్త జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తీరప్రాంతం, పారిశ్రామిక వసతులు రాష్ట్రానికి బలమని, స్టార్టప్స్ భాగస్వామ్యంతో అధునాతన పరికరాల తయారీ సాధ్యమని చెప్పారు. సముద్ర భద్రతే దేశ ఆర్థిక భద్రతకు మూలస్తంభమని, స్వదేశీ సాంకేతికతతో ఇండో-పసిఫిక్‌లో భారత ప్రయోజనాలను కాపాడవచ్చని వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా పేర్కొన్నారు.
News February 24, 2026
జింబాబ్వే ఘోర ఓటమి

T20 WCలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఘోరంగా ఓడిపోయింది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ZIM 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. ఏ దశలోనూ ఛేదన దిశగా సాగలేదు. ముగ్గురు డకౌట్ అయ్యారు. చివర్లో ఇవాన్స్(43) కాసేపు మెరుపులు మెరిపించారు. మోతీ 4, హొసీన్ 3, ఫోర్డె 2, హోల్డర్ ఒక వికెట్ తీశారు.


