News March 12, 2025
సంగారెడ్డి: ‘పరీక్షకు 352 మంది విద్యార్థులు గైర్హాజరు’

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో 96.81% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.16,727 మంది విద్యార్థులకు గాను 16,375 మంది విద్యార్థులు హాజరయ్యారని, 352 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
Similar News
News March 19, 2025
కల్వకుర్తి : ‘దూర విద్యలో చదివి.. హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగానికి ఎంపిక’

కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన తాళ్ల శివలీల గృహిణిగా ఉంటూ.. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ దూరవిద్యలో డిగ్రీ పూర్తి చదివింది. అనంతరం కల్వకుర్తిలో బీఈడీ పూర్తి చేసింది. భర్త తాళ్ల రాజేందర్, సోదరుడు బోయిన్ పల్లి శేఖర్ ప్రోత్సాహంతో హైదరాబాదులో ఉంటూ.. శిక్షణ తీసుకొని ప్రిపేర్ అయింది. 3 రోజుల క్రితం వెలువడిన హాస్టల్ వెల్ఫేర్ ఫలితాలలో ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు.
News March 19, 2025
అన్నమయ్య: భార్య గర్భిణి.. ప్రేయసితో భర్త జంప్

భార్యను మోసం చేసి భర్త మరో యువతితో వెళ్లిపోయిన ఉదంతంపై మంగళవారం రాత్రి బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కొత్తకోటకు చెందిన డ్రైవర్ అనిల్ ములకలచెరువు మండలానికి చెందిన 21ఏళ్ల యువతితో గతేడాది ఆగస్టులో వివాహమైంది. ప్రస్తుతం 6నెలల గర్భిణి. అయితే స్థానికంగా ఉండే యువతి మాయలో పడి గర్భంతో ఉన్న భార్యను వదిలేసి ప్రియురాలితో జంప్ అయ్యాడు. భార్య ఫిర్యాదుపై కేసు నమోదు అయింది.
News March 19, 2025
ఏలూరు హైవేపై కారును ఢీకొన్న లారీ

ఏలూరు జాతీయ రహదారిలోని ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులలో ఇద్దరు గాయపడ్డారు. లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. గుంటూరులోని ఓ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వ్యక్తిని తాడేపల్లిగూడెం తరలిస్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.