News January 25, 2025
సంగారెడ్డి : పాఠశాలను సందర్శించిన డీఈవో

సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను డీఈఓ వెంకటేశ్వర్లు శనివారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, పాఠశాల రికార్డులు, విద్యార్థులు చదువుతున్న తీరును పరిశీలించారు. డీఈఓ మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Similar News
News November 28, 2025
నిజామాబాద్: నామినేషన్ అభ్యర్థలకు కొత్త బ్యాంక్ అకౌంట్ కష్టాలు

గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచి, వార్డు సభ్యులు నామినేషన్ పత్రాలతో జీరో అకౌంట్ బ్యాంక్ ఖాతాను జతచేయాలని అధికారులు నిబంధనలు జారీ చేశారు. ఈ సమాచారం తెలియని అభ్యర్థులు నామినేషన్ దాఖలుకు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. కాగా అభ్యర్ధులకు జీరో అకౌంట్ ఖాతాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. కొత్త నిబంధన వల్ల అభ్యర్ధులు బ్యాంక్లకు క్యూ కడుతున్నారు.
News November 28, 2025
HYD: రాత్రికి రాత్రే ఊరు మారిపోదు బ్రో..

మా ఊరు గ్రేటర్లో విలీనమైంది. ఇక అభివృద్ధి పరుగులు పెడుతుందని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ‘అనేక గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు విలీనం అవుతున్నా, ప్రక్రియ పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది. ఆ తర్వాతే అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. రాత్రికి రాత్రే ఊరు దశ.. దిశ మారిపోదు. పస్తుతం ఉన్న మహానగరంలోనే సమస్యలున్నాయి. విలీనం తర్వాత కూడా ఉంటాయి’ అని శివారులో గుసగుసలు వినిపిస్తున్నాయి.
News November 28, 2025
ప్రచార రథం వద్ద ఏర్పాట్లు పరిశీలించిన ఆలయ ఈవో

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం తూర్పు భాగంలో ఏర్పాటుచేసిన స్వామి వారి ప్రచార రథం వద్ద ఏర్పాట్లను ఆలయ ఈవో రమాదేవి పరిశీలించారు. భక్తులు ప్రచార రథంలో ఉత్సవ విగ్రహాలను దర్శించుకుని, ఎల్ఈడి స్క్రీన్ పై ప్రధాన ఆలయంలో అర్చకులు జరుపుతున్న పూజలను తిలకిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ ఈవో రమాదేవి భక్తులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.


