News February 1, 2025
సంగారెడ్డి: పాఠశాలలకు నిర్వహణ నిధులు విడుదల

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, లోకల్ బాడి, కేజీబీవి, ఆదర్శ పాఠశాలలకు రెండవ విడత పాఠశాల నిర్వహణ గ్రాంటు నిధులు విడుదలయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. గతంలో 50శాతం నిధులు విడుదల కాగా మిగతా 50శాతం నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ నిధులను పాఠశాల ఎస్ఎంసీ ఖాతాలో జమ చేశామని చెప్పారు.
Similar News
News November 15, 2025
‘ప్రతి ఒక్కరూ మధుమేహ పరిక్షలు చేయించుకోవాలి’

ప్రతి ఒక్కరూ మధుమేహ పరిక్షలు చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. శుక్రవారం ప్రపంచ మధుమేహ దినోత్సవ సందర్భంగా బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇన్సులిన్ కనుగొన్న సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ జన్మదినాన్ని ప్రపంచ మధుమేహ దినోత్సవంగా నిర్వహిస్తారన్నారు. ఆయన వెంట డీఎంహెచ్ఓ విజయమ్మ, డీఈఓ పురుషోత్తం తదితర అధికారులు ఉన్నారు.
News November 15, 2025
బిహార్‌లో ‘నిమో’ డబుల్ సెంచరీ

బిహార్‌లో ఎన్నికల్లో నిమో(నితీశ్-మోదీ) ఆధ్వర్యంలోని NDA డబుల్ సెంచరీ కొట్టింది. 243 స్థానాలకు గానూ 203 సీట్లు కైవసం చేసుకుంది. BJP 90 స్థానాల్లో, JDU 85 చోట్ల, LJP 19 నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. HAM-5, RLM-4 సీట్లు కైవసం చేసుకున్నాయి. అటు కాంగ్రెస్-RJD నేతృత్వంలోని మహాగఠ్ బంధన్ ఇప్పటివరకు 34 సీట్లకే పరిమితం అయింది. ఆర్జేడీ 24, INC-6 సీట్లు గెలుచుకున్నాయి.
News November 15, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> ట్రాక్టర్ ఢీకొని స్కూల్ విద్యార్థి మృతి
> పాలకుర్తి ఆలయ వేలం పాట వాయిదా
> జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
> చెక్కులను పంపిణీ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే
> సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడియం
> జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
> రోడ్డు ఊడ్చే పరికరం పని తీరును పరిశీలించిన అదనపు కలెక్టర్
> విజ్ఞానశాస్త్ర ప్రదర్శన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్


