News March 12, 2025
సంగారెడ్డి: పాఠశాలలో మొక్కలు నాటిన కలెక్టర్

జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరి బుధవారం సందర్శించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెలలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు అందరూ వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర్లు, ఎంఈవో విద్యాసాగర్ పాల్గొన్నారు.
Similar News
News November 28, 2025
జనవలో విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్ళు రద్దు (1/2)

➤ జనవరి 27న (17480)తిరుపతి – పూరి ఎక్స్ ప్రెస్
➤ 28న (17479)పూరి -తిరుపతి ఎక్స్ ప్రెస్
➤ 28న (22708)తిరుపతి -విశాఖ డబల్ డెక్కర్
➤ 29న (22707)విశాఖ -తిరుపతి )డబల్ డెక్కర్
➤ 28,29న (17219)మచిలీపట్టణం -విశాఖ ఎక్స్ ప్రెస్
➤ 29,30న (17220)విశాఖ -మచిలీపట్టణం ఎక్స్ ప్రెస్
➤ 31న (22876, 22875 ) గుంటూరు -విశాఖ,విశాఖ – గుంటూరు ఉదయ్ ఎక్స్ ప్రెస్ రద్దు చేశారు
News November 28, 2025
ADB: 4 పంచాయతీల్లో సర్పంచ్‌ల ఏకగ్రీవ ఎన్నిక

సిరికొండ మండలంలో 4 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లను గ్రామ పెద్దలు ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఎన్నుకున్నారు. రిమ్మలోని జంగుబాయి, రాయిగూడలో లక్ష్మణ్, కుంటగూడలో మీరబాయి, కన్నాపూర్‌లో బాలదేవిబాయిలను గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామ పెద్దలు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఒకే రోజు 4 గూడాల్లో ఏకగ్రీవం కావడం విశేషం. గిరిజన సంస్కృతికి అనుగుణంగా గ్రామస్థులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు.
News November 28, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ WARNING

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను వేలం ద్వారా దక్కించుకోవాలని ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలన్నారు. జిల్లాలో వేలం పద్ధతిలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల వేలం నిర్వహించినా, ప్రయత్నించినా టోల్ ఫ్రీ నంబర్ 8978928637 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.


