News April 7, 2025

సంగారెడ్డి: పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

image

పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఈనెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జానకి దేవి సోమవారం ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అర్హులని చెప్పారు. దరఖాస్తులను www.polycet.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News April 8, 2025

MHBD: యువకుడి మృతి.. జ్ఞాపకంగా విగ్రహావిష్కరణ

image

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి గ్రామానికి చెందిన రేపాల భిక్షపతి అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అందరితో కలిసి మెలిసి ఉండే భిక్షపతి చిన్న వయసులోనే మృతి చెందడంతో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యుల జ్ఞాపకంగా సోమవారం అతడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో పలువురు వారిని అభినందించారు.

News April 8, 2025

శాతవాహన వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

image

శాతవాహన యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 39 మంజూరు పోస్టులకు గాను 16 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 21 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్‌ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా వీటిలో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

News April 8, 2025

అలంపూర్: ‘అభివృద్ధికి నోచుకోని తెలంగాణ టూరిజం హోటల్’

image

అలంపూర్ పట్టణంలోనీ ప్రధాన కూడలిలో ఉన్న తెలంగాణ టూరిజం హోటల్ ప్రస్తుతం భోజనాలు లేక ఆలయాలకు వచ్చే సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో వసతి రూములతో పాటు క్యాంటీన్ ఉండడంతో భక్తులకు భోజనాలకు ఇబ్బంది ఉండేది కాదు. ఈ హోటల్‌కి వచ్చే సందర్శకులు ఏసీ రూములు మాత్రమే ఉన్నాయి. టూరిజం హోటల్‌ను అభివృద్ధి చేసి క్యాంటీన్, నాన్ ఏసీ రూములను ఏర్పాటు చేస్తే ఉపయోగపడుతుందని స్థానికులు కోరుతున్నారు.

error: Content is protected !!