News April 24, 2024

సంగారెడ్డి: పిడుగుపాటుతో మహిళ మృతి

image

పిడుగుపాటులో మహిళ మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మాసాన్‌పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్వ రేణుక(32) ఊరి శివారులో మేకలు మేపుతుంది. సాయంత్రం ఉరుములు,మెరుపులతో వర్షం పడటంతో రేణుక మరో ఇద్దరు ఓ చెట్టుకుందికి వెళ్లారు. ఈ క్రమంలో పిడుగుపాటు పడి రేణుక అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాల్యయి. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Similar News

News October 25, 2025

మెదక్ ఎస్పీ కార్యాలయంలో 99 యూనిట్ల రక్త సేకరణ

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మెదక్ ఎస్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 99 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అడిషనల్ ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలకు స్మారకంగా నిర్వహించిన ఈ శిబిరం సామాజిక సేవకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సేకరించిన రక్తంలో 80 యూనిట్లు నిలోఫర్ ఆసుపత్రికి, 19 యూనిట్లు మెదక్ బ్లడ్ బ్యాంకుకు తరలించారు.

News October 25, 2025

మెదక్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గా రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు

image

మెదక్ జిల్లా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గా రాజశేఖర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న మధుసూదన్ గౌడ్ కామారెడ్డికి బదిలీ కావడంతో ఆయన స్థానంలో టాస్క్‌ఫోర్స్ సీఐగా ఉన్న కృష్ణమూర్తిని డీసీఆర్‌బీకి బదిలీ చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్ రెడ్డి.. అదనపు ఎస్పీ మహేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సమర్థవంతంగా విధులు నిర్వహిస్తానని తెలిపారు.

News October 25, 2025

మెదక్: సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ శిక్షణ

image

గ్రామీణ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్, సర్వీసింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలో చెందిన యువతకు 15 రోజులపాటు ఉచిత శిక్షణ, సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.