News April 4, 2025

సంగారెడ్డి: పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి

image

ఉపాధి హామీలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు మూడు నెలలు, కూలీలకు రెండు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏవో పరమేశంకు గురువారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ.. వేతనాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

Similar News

News April 18, 2025

భూభారతి ద్వారా రైతులకు మేలు: భద్రాద్రి కలెక్టర్

image

భూభారతిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కరకగూడెం మండలంలోని జిల్లా పరిషత్‌ హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన భూభారతి నూతన చట్టం అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

News April 18, 2025

సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఖైదీ మృతి

image

సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ వెంకట్(39) గుండెపోటుతో మృతి చెందారు. మెదక్ నర్సాపూర్‌కు చెందిన వెంకట్‌ను ఓ కేసులో ఈనెల 3న సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. ఇవాళ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వెంకట్ మరణించినట్లు జైలు అధికారులు ప్రకటించారు. మృతదేహాన్ని సంగారెడ్డిలోని మార్చురీకి తరలించారు.

News April 18, 2025

‘అద్భుత శిల్ప సంపద మన మెదక్’

image

ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలయం మన మెదక్. జిల్లాలో వేల్పుగొండ తుంబురేశ్వర స్వామి ఆలయం, వెల్దుర్తి కాకతీయ కళాతోరణం, కొంటూరు మసీద్, 100 ఏళ్ల సీఎస్ఐ చర్చి లాంటి ఎన్నో అద్భుతమైన పురాతన కట్టడాలు ఉన్నాయి. కొన్ని కట్టడాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చరిత్ర పరిశోధకుడు సంతోశ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు World Heritage Day

error: Content is protected !!