News March 11, 2025
సంగారెడ్డి: పోలీసు అధికారులను హెచ్చరించిన ఎస్పీ

జిల్లాలో పోలీసు అధికారులు అంకితభావంతో పనిచేయాలని నూతన ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులు ఉంటే వెంటనే పరిష్కరించేలా చూడాలని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు.
Similar News
News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. ఎదురు చూస్తున్న మానుకోట!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మెడికల్ కళాశాల నిర్మాణ భవనాలు, ప్రధాన రహదారులు, సైడ్ డ్రైనేజీలకు నిధులు కేటాయించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు, తాగునీరు అందించాలన్నారు. జిల్లాలో 100 పడకల ఆసుపత్రికి నిధులు మంజూరు చేసి త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. పెద్దపల్లి జిల్లాకు ఏం కావాలంటే..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే జిల్లాలోని చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు అందుతాయని తెలిపారు. అలాగే జిల్లాలో బస్సు డిపో త్వరగా పూర్తిచేయాలని, పాలకుర్తి ఎత్తిపోతల పథకం, సుందిళ్ల రిటరింగ్ ప్రహరీ నిర్మాణం, రామగుండంలో దంత, పాలిటెక్నిక్ కళాశాల, విమానాశ్రమం, అలాగే జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.
News March 12, 2025
నేడు బడ్జెట్… NZB జిల్లాకు ఏం కావాలంటే?

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా సాగునీటి సమస్యను పరిష్కరించాలని, ప్రస్తుతం పసుపు రైతులు ఎదుర్కొంటున్న మద్దతు ధర సమస్య విషయంలో చొరవ చూపాలని కోరుతున్నారు. అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు చెప్పట్టాలని, జిల్లాలో ప్రభుత్వ ఇంజినీర్ కళాశాల నిర్మణానికి నిధులు కేటాయించాలి కోరుతున్నారు.