News January 27, 2025
సంగారెడ్డి: ప్రజావాణికి 65 ఫిర్యాదులు

కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 65 మంది తమ ఫిర్యాదులను కలెక్టర్‌కు సమర్పించారు. రెవిన్యూ శాఖ 25, పౌర సరఫరాల శాఖ2, మార్క్ ఫెడ్1, సర్వే ల్యాండ్ రికార్డ్ 9, పంచాయితీ & పీటీ విభాగం 4, పంచాయతీరాజ్, 2, మున్సిపల్ విభాగం 9 ఫిర్యాదులు వచ్చాయన్నారు.
Similar News
News October 15, 2025
జూబ్లీహిల్స్‌లో KCR రోడ్ షోకు PLAN

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS అభ్యర్థి మాగంటి సునీత తరఫున ఆ పార్టీ ఈనెల 19న భారీ రోడ్‌షోకు ఏర్పాట్లు చేసింది. ఇందులో BRS చీఫ్ KCR పాల్గొంటారనే టాక్ వినిపిస్తోంది. ప్రతిష్ఠాత్మక పోరులో గెలిపే లక్ష్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే జూబ్లీ బరిలో పావులు కదుపుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా KCR తప్పకుండా జూబ్లీహిల్స్‌లో ఎంట్రీ ఇస్తారని కార్యకర్తలు ఆశాగా చూస్తున్నారు.
News October 15, 2025
భద్రాద్రి జిల్లాలో 193 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

భద్రాద్రి జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోలు కోసం 193 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలో 2,02,862 మెట్రిక్ టన్నుల సన్నరకం, 35,315 మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం ఉంటాయని చెప్పారు. అవసరాన్ని బట్టి అదనపు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. సన్నరకానికి అదనంగా రూ.500 ఇస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
News October 15, 2025
జూబ్లీహిల్స్: సాదాసీదాగా సునీత నామినేషన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్ వేశారు. షేక్‌పేటలోని తహశీల్దార్ కార్యాలయంలో KTRతో కలిసి ఎలాంటి హడావుడి లేకుండా నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆమె వెంట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.