News April 21, 2025

సంగారెడ్డి: ప్రజావాణిలో 63 ఫిర్యాదులు

image

కలెక్టరేట్ లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 63 మంది తమ సమస్యలను అదనపు కలెక్టర్‌కు విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

Similar News

News December 17, 2025

నారాయణపేట: తుది దశలో మొదటి విజయం

image

ఊట్కూరు మండల పరిధిలోని సమిస్తాపూర్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల తొలి ఫలితం వెలువడింది. గ్రామంలో మొత్తం 440 ఓట్లు ఉండగా 382 ఓట్లు పోలయ్యాయి. నలుగురు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీలో రింగు గుర్తుకు 48, కత్తెర గుర్తుకు 176, బ్యాట్ గుర్తుకు 30, ఫుట్‌బాల్ గుర్తుకు 127 ఓట్లు వచ్చాయి. ఇందులో కత్తెర గుర్తుతో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జయప్రకాశ్ రెడ్డి సర్పంచ్‌గా గెలుపొందారు.

News December 17, 2025

గొల్లభామ తండా సర్పంచ్‌గా బాలు నాయక్

image

చెన్నారావుపేట మండలంలోని గొల్లభామ తండా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన గుగులోతు బాలు నాయక్ విజయం సాధించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజలతో కలిసి ముందుకు సాగుతానని, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

News December 17, 2025

ఉగాది నాటికి మరో 5 లక్షల గృహప్రవేశాలు: CM

image

AP: గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని CM CBN కలెక్టర్లను ఆదేశించారు. ‘ఇటీవల 3 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాం. ఉగాది నాటికి మరో 5 లక్షల గృహప్రవేశాలు నిర్వహించబోతున్నాం. ప్రతి 3 నెలలకు టార్గెట్ పెట్టుకుని నిర్మాణం పూర్తి చేయాలి. గతంలో ఊళ్లకు దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించడంతో కొందరు వెళ్లడం లేదు. వారికి ఇతర ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలి’ అని సూచించారు.