News February 25, 2025

సంగారెడ్డి: ప్రజా పోరాటాల వేదిక జిల్లా కన్వీనర్‌గా రాజయ్య

image

ప్రజా పోరాటాల వేదిక జిల్లా కన్వీనర్‌గా రాజయ్యను సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో నిర్వహించిన సమావేశంలో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజయ్య మాట్లాడుతూ.. తనను జిల్లా కన్వీనర్‌గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తారని పేర్కొన్నారు. జిల్లా కన్వీనర్‌గా నియామకమైన రాజయ్యను సన్మానించారు.

Similar News

News February 26, 2025

వరంగల్: ముమ్మరంగా తెర వెనుక ప్రచారం..!

image

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం బయటకు పెద్దగా కనిపించలేదు. కానీ విద్యా సంస్థలు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి. ప్రధానంగా విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్న HNK, WGLతో పాటు NSPT, JN, MHBD, BHPL పట్టణాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఉమ్మడి జిల్లాలో 11,189 మంది ఓటర్లు ఉన్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు సామ దాన భేద దండోపాయాలను అమలు చేస్తున్నారు.

News February 26, 2025

పిట్లం: రాజీ కాలేదని కన్నతల్లిని కొట్టి చంపేశాడు..!

image

కన్న తల్లిని కొడుకు చంపిన ఘటన పిట్లంలో మంగళవారం జరిగింది. SI రాజు వివరాలిలా.. సాబేర బేగం(60)కు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు. రెండో కొడుకైన శాదుల్ నాలుగేళ్ల క్రితం తన తమ్ముడైన ముజిబ్‌ను కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో రాజీపడాలని తల్లిని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో రోకలి బండతో తలపై దాడి చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 26, 2025

HYDలో అందుబాటులోకి వచ్చిన మరో ఫ్లైఓవర్

image

TG: హైదరాబాద్ నగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. గోల్నాక చర్చి నుంచి ఛే నంబర్ మీదుగా అంబర్‌పేట్ వరకు నిర్మించిన ఈ పైవంతెనపై నేటి నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు. రూ.445 కోట్లతో 1.65 కి.మీ పొడవునా 4 లేన్లతో దీన్ని నిర్మించారు. 2018లో దీనికి శంకుస్థాపన చేశారు. ఉప్పల్ నుంచి MGBS, సిటీ నుంచి వరంగల్ హైవే వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ తగ్గనుంది.

error: Content is protected !!