News March 10, 2025

సంగారెడ్డి: ప్రణాళికతో చదివితే మంచి మార్కులు

image

పదవ తరగతి విద్యార్థులు ప్రణాళికతో చదివితే మంచి మార్కులు వస్తాయని ఎస్టీవో శారద అన్నారు. సంగారెడ్డిలోని సాంఘిక సంక్షేమ విద్యార్థులకు అవగాహన సదస్సు ఆదివారం నిర్వహించారు. పరీక్షలు రాసే విధానం పరీక్షలకు, ఎలా సిద్ధం కావాలో తదితర అంశాల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారులు రమేష్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Similar News

News March 21, 2025

నిర్మల్: ‘9059987730 నంబర్‌కు కాల్ చేయండి’

image

జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణలో సందేహాలపై అధికారులు హెల్ప్ లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరికైనా పరీక్షల నిర్వహణపై ఎటువంటి సమాచారం కావాలన్నా, సందేహాలున్నా 9059987730 నంబరును సంప్రదించవచ్చని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. పదో తరగతి పరీక్షలపై ఎటువంటి అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేసిన చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.

News March 21, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 21, 2025

దాడి కేసులో ఇద్దరికి రిమాండ్: వాంకిడి ఎస్సై

image

వాంకిడి మండలంలోని ఓ బిర్యాణి హోటల్ యజమానిపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం..ఈ నెల 18న వాంకిడిలోని ఓ బిర్యానీ హోటల్లో రవిచంద్ర కాలనీకి చెందిన కొండ సంతోష్, పస్తం ఇషాక్ మద్యం మత్తులో బిర్యానీ తినడానికి వెళ్లారు. ఈ క్రమంలో హోటల్ యజమానితో గొడవకు దిగి దాడి చేశారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

error: Content is protected !!