News February 11, 2025
సంగారెడ్డి: ప్రతిభ పోటీలను సద్వినియోగం చేసుకోవాలి: DEO

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సైన్స్ మ్యూజియంలో నిర్వహించిన జిల్లా స్థాయిలో నిర్వహించిన భౌతిక రసాయన శాస్త్రం ప్రతిభ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం డిఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతిభ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Similar News
News November 19, 2025
సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు గిల్ దూరం!

SAతో తొలి టెస్టులో మెడనొప్పికి గురైన IND కెప్టెన్ గిల్ రెండో టెస్టుకు దూరమయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. తొలి టెస్టులో బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యంతో ఘోర ఓటమి మూటగట్టుకున్న భారత్‌కు గిల్ దూరమవడం పెద్ద ఎదురుదెబ్బని చెప్పవచ్చు. అతడి ప్లేస్‌లో BCCI సాయి సుదర్శన్‌ను తీసుకుంది. పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి గువాహటిలో రెండో టెస్ట్ ప్రారంభం అవుతుంది.
News November 19, 2025
ప్రతి 3వ శుక్రవారం ఫిర్యాదులకు అవకాశం: కలెక్టర్

ఉద్యోగుల ఫిర్యాదుల దినోత్సవంలో భాగంగా ప్రతి మూడవ శుక్రవారం ఉద్యోగులు తమ వ్యక్తిగత సమస్యలు సహా అన్ని రకాల ఫిర్యాదులను నేరుగా సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ప్రకటించారు. అందిన ప్రతి ఫిర్యాదును ప్రత్యేక ఐడీతో పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఈ ప్రత్యేక నంబర్ ద్వారా ఉద్యోగి తన ఫిర్యాదు స్థితిని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్లు ఆమె తెలిపారు.
News November 19, 2025
సిద్దిపేట: పారదర్శకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ: కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ జిల్లాలో పూర్తి పారదర్శకంగా జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.


