News January 27, 2025
సంగారెడ్డి: ప్రధాన సమస్యలపై తీర్మానాల ఆమోదం: సీపీఎం

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై రాష్ట్ర మహాసభలో చర్చించి పలు కీలక అంశాలపై తీర్మానాలను ఆమోదించామని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, మల్లు లక్ష్మి తెలిపారు. సంగారెడ్డిలోని మల్లు స్వరాజ్యం ప్రాంగణం(గోకుల్ గార్డెన్)లో జరుగుతున్న రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా మీడియా పాయింట్లో చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నాలుగు రోజులపాటు ప్రధాన అంశాలపై చర్చించినట్లు వారు తెలిపారు.
Similar News
News November 24, 2025
WGL: భారీగా తగ్గిన వండర్ హాట్ మిర్చి ధర

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు సోమవారం మిర్చి భారీగా తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.17,500 ధర రాగా, వండర్ హాట్(WH) మిర్చికి రూ.18000 ధర వచ్చింది. అలాగే తేజ మిర్చి రూ.14,500 ధర పలికింది. కాగా, గతవారం వండర్ హాట్ మిర్చికి రూ. 20 వేల ధర రాగా ఈరోజు భారీగా తగ్గడం రైతన్నకు నిరాశ కలిగించే విషయం.
News November 24, 2025
నకిలీ వెబ్సైట్ల కలకలం.. శ్రీశైలం భక్తులకు అలర్ట్

AP: శ్రీశైలంలో వసతులు కల్పిస్తామంటూ AP టూరిజం, శ్రీశైలం దేవస్థానం పేరుతో ఫేక్ వెబ్సైట్ల ద్వారా దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ₹30Kతో రూమ్స్ బుక్ చేశారు. అక్కడికి వచ్చి రశీదు చూపించగా సిబ్బంది నకిలీదని చెప్పడంతో షాకయ్యారు. ఇలాగే పలువురు మోసాలకు గురయ్యారు. దీంతో ఆయా వెబ్సైట్లపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు EO శ్రీనివాసరావు తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News November 24, 2025
చందూర్: పదో తరగతి విద్యార్థి సూసైడ్

నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మైనార్టీ గురుకుల పాఠశాలలో పదోతరగతి విద్యార్థి గతరాత్రి గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రిన్సిపల్..పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఎస్సై సాయన్న తెలిపారు.


