News March 19, 2025

సంగారెడ్డి: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

image

జిల్లాలో ఈనెల 5 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిశాయని సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగియడంతో పాటు త్వరలోనే ఫలితాలను విడుదల చేసేందుకు స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

Similar News

News February 28, 2026

ఈరోజు నమాజ్ వేళలు (28-2-2026) శనివారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.23 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 3.51 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.23 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.35 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 28, 2026

SVU: పీజీ ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది ఏప్రిల్ నెలలో నిర్వహించిన పీజీ (PG) రెండవ సెమిస్టర్ M.Sc బోటనీ/ బయో కెమిస్ట్రీ/ జాగ్రఫీ/ఫిజిక్స్ /మ్యాథమెటిక్స్ /అప్లైడ్ మ్యాథమెటిక్స్ /స్టాటిస్టిక్స్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు డీన్ సురేంద్రబాబు పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News February 28, 2026

KMR: జాతీయ స్థాయికి ఉపాధ్యాయుల నామినేట్

image

స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (SHVR) జాతీయ సర్వేలో జిల్లా నుంచి జాతీయ స్థాయికి నామినేట్ అయిన TSNR ZPHS బీబీపేట్, MPPS మహమ్మదాపూర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రవీంద్రారెడ్డి, ప్రభాకర్‌లను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం అభినందించారు. జాతీయ స్థాయిలో పురస్కారాన్ని సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో DEO రాజు, MEO అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.