News February 3, 2025

సంగారెడ్డి: ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రాం సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

Similar News

News January 18, 2026

NGKL: మున్సిపల్ ఎన్నికలు.. అభ్యర్థుల అర్హతలు

image

2026 మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులకు అధికారులు నిబంధనలు ఖరారు చేశారు. అభ్యర్థి 21 ఏళ్లు నిండిన భారత పౌరుడై ఉండాలి. సంబంధిత మున్సిపాలిటీలో ఓటరుగా ఉండాలి. పార్టీ అభ్యర్థికి ఒకరు, స్వతంత్రులకు 10 మంది ప్రపోజర్లు అవసరం. ఖర్చు పరిమితి రూ.2 లక్షల- రూ.10 లక్షల వరకు ఉంటుంది. ప్రతి ఖర్చును రిజిస్టర్‌లో నమోదు చేయడం తప్పనిసరి.

News January 18, 2026

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. నేషనల్ పార్కు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిన్న నలుగురు, ఇవాళ ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలంలో AK-47 సహా 6 తుపాకులు, పేలుడు పదార్థాలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

News January 18, 2026

తూ.గో: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కొవ్వూరు మండలం దేచర్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్ట సత్యనారాయణ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. పంగిడి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సత్యనారాయణతో పాటు ఉన్న కోటి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు క్రషర్ కార్మికుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. సత్యనారాయణకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.