News March 13, 2025
సంగారెడ్డి: ఫస్టియర్ పరీక్ష.. 97.42% హాజరు

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 96.81% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.16,290 మంది విద్యార్థులకు గాను 15,869 మంది విద్యార్థులు హాజరయ్యారని, 421 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
Similar News
News December 3, 2025
తిరుమల: డిసెంబర్ 5న డయల్ యువర్ ఈవో

డయల్ యువర్ ఈవో కార్యక్రమం డిసెంబర్ 5వ తేదీన ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్కి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.
News December 3, 2025
1,232 విమానాలు రద్దు: DGCA

IndiGo ఇటీవల 1,232 విమానాలను రద్దు చేసిందని DGCA ప్రకటించింది. ఇందులో సిబ్బంది, FDTL పరిమితుల వల్లే 755 ఫ్లైట్స్ రద్దయినట్లు పేర్కొంది. ATC సమస్యలతో 16% ఫ్లైట్స్, క్రూ రిలేటెడ్ డిలేస్తో 6%, ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ లిమిటేషన్స్ వల్ల 3% సర్వీసులు క్యాన్సిల్ అయినట్లు తెలిపింది. OCTలో 84.1%గా ఉన్న IndiGo ఆన్-టైమ్ పర్ఫార్మెన్స్ NOVలో 67.7%కి డ్రాప్ అయిందని వివరించింది. HYDలోనూ పలు విమానాలు రద్దయ్యాయి.
News December 3, 2025
బాపట్ల: డ్రైవర్ నిర్లక్ష్యంతో వ్యక్తి బలి..!

సంతమాగులూరు మండలం పుట్టావారి పాలెం జంక్షన్ వద్ద బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై పట్టాభిరామయ్య వివరాల మేరకు.. రొంపిచర్ల మండలం అచ్చయ్యపాలెం గ్రామానికి చెందిన జాస్తి నాగేశ్వరరావు(54) టీవీఎస్ ఎక్సెల్ మీద వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదైంది.


